హైదరాబాదులో ఎక్స్పైరీ మిల్క్ పౌడర్ స్వాధీనం..!

-

హైదరాబాదులో కాలం చెల్లిన పాల పౌడర్ ను పట్టుకున్నారు అధికారులు. ఐదువేల కిలోల పైచిలుకు ఎక్స్పైరీ మిల్క్ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ,పుడ్ సేఫ్టీ అధికారులు కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ లో.. కాలం చెల్లిన పాల పొడి విక్రయిస్తున్న దామోదర్ ను అరెస్ట్ చేసారు. మొత్తం 5,280 కిలోల కాలం చెల్లిన పాలపొడిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

అయితే ఈ పాల పొడి కర్ణాటక లోని పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసే పాల పొడిగా గుర్తించారు అధికారులు. కర్ణాటక నుండి అక్రమంగా తీసుకువచ్చి ఇక్కడ విక్రయాలు చేస్తుంది ఈ ముఠా. సికింద్రాబాద్ ,తార్నాకాలోని విజయపురి కాలనీలో అధిక మొత్తంలో పాలపొడి విక్రయం జరిపారు నిందితులు. నగరంలోని పనీర్, స్వీట్‌ల తయారి కేంద్రాలకు అలాగే ఫుట్‌ పాత్‌ లో వ్యాపారాలు చేసే వారికి ఈ పాల పొడిని అమ్ముతుందిముఠా. ముఖ్యంగా ఫుట్ పాత్ పై టీ అమ్మే వారికి ఈ పాల పౌడర్ ను అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news