తెలంగాణలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో రాజన్నసిరిసిల్ల జిల్లా లోని వేములవాడ రాజన్న ఆలయం మొదట గుర్తుకు వస్తుంది. అయితే తాజాగా ఈ వేములవాడ టెంపుల్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఏసీబీ అధికారిక ట్విటర్ ఖాతాలో ఆలయంలో చేసిన సోదాలపై కొన్ని విషయాలను పోస్ట్ చేసారు ఏసీబీ అధికారులు. ముఖ్యంగా తనిఖీలో అవకతవకలు గుర్తించినట్లు అధికారులు పేర్కొనారు. స్టాక్ రిజిస్టర్‌లో చాల తేడాలు ఉన్నాయని తెలిపారు. నెయ్యి, జీడిపప్పు అలాగే నూనెకు సంబంధించిన వివరాలు సరిగ్గా లేవు అని పేర్కొన్నారు.
అదే విధంగా తల నీలాలు సమర్పించడం కోసం వచ్చే భక్తుల నుండి కల్యాణకట్ట వద్ద రూ.50 లేదా రూ.100 వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన టెండర్లకు కమిషనర్ లేదా దేవాదాయ శాఖ ఆమోదం లేకుండానే పాత టెండర్ల ప్రకారం ఇష్టం వచ్చినట్లు వస్తువులను కొనుగోలు చేస్తున్నారు ట్విటర్ లో పోస్ట్ చేసారు ఏసీబీ అధికారులు.