కృష్ణాష్టమి స్పెషల్.. పూరీ తీరంలో గోపాలుడి సైకత శిల్పం

-

శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఒడిశాలోని పూరీ తీరంలో ప్రముఖ సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ అందమైన కళాకృతిని రూపొందించారు. ఇసుకతో చిన్ని కృష్ణుడి చిత్రాన్ని రూపొందించారు. ఆ పక్కనే వెన్నతో నిండిన కుండల్ని గీశారు. చెడు నశించాలి అనే సందేశాన్ని కళాకృతి కింద పేర్కొన్నారు. కుడి వైపు కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సైకత శిల్పం చూపరులను కట్టిపడేస్తోంది. ఏ వేడుక వచ్చినా.. ప్రత్యేక సందర్భం ఏదైనా సరే సుదర్శన్ పట్నాయక్ తన సాండ్ ఆర్ట్తో ప్రజలను ఆకట్టుకుంటారన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా కృష్ణాష్టమి స్పెషల్గా కిట్టయ్య రూపాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ సైకత శిల్పం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. రాధే రాధే, జై శ్రీకృష్ణ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో హ్యాపీ జన్మాష్టమి అంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు కృష్ణాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఇస్కాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుంటున్న భక్తులు రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news