PUBG ఆడుకోనివ్వడం లేదని నెయిల్ కట్టర్లు మింగిన యువకుడు

-

మొబైల్లో పబ్జీ వీడియో గేమ్ ఆడుకోవడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారని ఓ యువకుడు తాళం చెవి, నాలుగు అంగుళాల కత్తి, నెయిల్ కట్టర్లు మింగేశాడు. ఆరోగ్యం విషమించి ఆస్పత్రి పాలైన ఆ యువకుడికి సర్జరీ చేసిన వైద్యులు కడుపులోంచి ఆ వస్తువులను బయటకు తీశారు. ఈ ఘటన బిహార్‌ తూర్పు చంపారన్ జిల్లాలో చోటుచేసుకుంది.

మోతిహారీలోని చాంద్మారి ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువకుడు మొబైల్లో వీడియో గేమ్లకు అలవాటుపడ్డాడు. గేమ్స్ ఆడొద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో అతడను తాళం చెవి, కీ రింగ్, చిన్న కత్తి, నెయిల్ కట్టర్లు వంటి మెటల్ వస్తువులు మింగాడు. అతడికి సర్జరీ చేసిన అనంతరం వైద్యులు మాట్లాడుతూ ప్రస్తుతం అతని అరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. అయితే ఆ యువకుడు మానసిక అనారోగ్యంతో ఉన్నాడని చెప్పారు. దాదాటు గంటపాటు ఆపరేషన్ చేసి, అతడి కడుపులో నుంచి తాళం చెవి, ఒక కత్తి, రెండు నెయిల్ కట్టర్లు, చిన్న మెటల్ వస్తువులను తొలగించినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news