ఆయుష్మాన్ కార్డు విషయంలో ఈ పొరపాటు చెయ్యొద్దు..!

-

కేంద్ర ప్రభుత్వం అనేక రకాల స్కీములను తీసుకు వచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రధానమంత్రి జన ఆరోగ్య యువజన పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీం కింద కేంద్రం ప్రతి ఒక్క కుటుంబానికి ఐదు లక్షల వరకు వైద్యం కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. సామాజిక, ఆర్థిక, కుల జనగణన ప్రాతిపాదికగా లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తారు. 2018 సెప్టెంబర్ 23న కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమును ప్రారంభించింది.

ఆరోగ్య బీమా పథకం దేశంలో 50 కోట్ల మంది లబ్ధిదారులను ఉద్దేశించి మొదలుపెట్టారు. అయితే మీరు కూడా ఈ కార్డుని పొందాలి అనుకుంటున్నారా..? అయితే మాత్రం మోసగాళ్ల వలలో పడకండి. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పేరుతో కూడా మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి మోసగాళ్ల చేతిలో పడితే కచ్చితంగా జేబులకు చిల్లు పడుతుంది. ఆయుష్మాన్ భారత్ కార్డుని పొందే క్రమంలో ఇబ్బందుల్ని ఎదుర్కోకుండా ఉండాలంటే తెలియని వ్యక్తి కాల్ చేసి ఏదైనా లింక్ పంపించి డౌన్లోడ్ చేసుకోమని చెప్తే.. డౌన్లోడ్ చేసుకోవద్దు.

పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి. అనవసరంగా ఇలాంటి లింక్స్ పై క్లిక్ చేశారంటే మీ మొబైల్ హ్యాక్ అవుతుంది. ఎవరూ కూడా ఫోన్ చేసి కార్డు ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పరు మీరే వెబ్సైట్లోకి వెళ్లి స్కీం పేరుతో ఉన్న కార్డు ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మోసగాళ్లు ఇలా ఆయుష్మాన్ భారత్ కార్డుని డౌన్లోడ్ చేసుకోమని లింక్స్ పంపిస్తున్నారు. ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news