తన భార్య బర్త్ డే వేడుకలపై చిలకలూరిపేట ఎమ్మెల్యే ,మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు క్లారిటీ ఇచ్చారు. పోలీసులతో ట్రాఫిక్ సమస్యల మీద చర్చించడానికి సమావేశం పెట్టుకున్నామని… నేను బయట నుంచి వచ్చే లోపు కొంతమంది కార్యకర్తలు బర్త్ డే కేక్ కట్ చేయమని నా సతీమణి నీ అడిగారని తెలిపారు. పక్కనే ఉన్న పోలీసులు కూడా ఆ కేక్ కటింగ్ వద్దకు వచ్చారు తప్పా… ఉద్దేశపూర్వకంగా ఏ కేక్ కటింగ్ లు చేయలేదని వెల్లడించారు చిలకలూరిపేట ఎమ్మెల్యే ,మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.
మా కుటుంబంలో బర్తడే వేడుకలు చేసుకునే సంస్కృతి లేదు…నేను కూడా బర్త్‌డే వేడుకలకు, సాధ్యమైనంత వరకు దూరంగానే ఉంటానని పేర్కొన్నారు. కొన్ని చానల్స్ లో నాపై బురదజల్లే ప్రయత్నం చేశారని ఆగ్రహించారు. నా కుటుంబ సభ్యులు ఏ బదిలీల్లో, గాని అక్రమ లావాదేవీల్లో గాని ఉండరు…అలా ,ఉన్నారని నిరూపిస్తే , ఎమ్మెల్యే పదవికి, పార్టీ పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. నాకు సంబంధం లేని అంశాలలో నాపై కావాలని బురదజల్లు తున్నారని ఆగ్రహించారు. గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పాలనలో అనేక కష్టాలు పడ్డానన్నారు. నన్ను అనేక పర్యాయాలు ఇబ్బంది పెట్టి నా కుమారుడి పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు….ఇప్పుడు కూడా ఇలాంటి దుష్ప్రచారాలు చేపిస్తున్నారని మండిపడ్డారు.