అభంశుభం తెలియని మైనర్ బాలికలపై కొందరు కామాంధులు మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు.ప్రతి రోజూ ఏదో ఒక మూలన ఇటువంటి లైంగికదాడుల కేసులు పెరుగుతున్నాయి. అయితే, ఈ ఘటనల్లో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తుండగా,మరికొందరు కుటుంబం పరువుకోసం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం లేదు.ఈ మధ్యకాలంలో మన చుట్టూ ఉండే ఇరుగుపొరుగు వారి నుంచే పెనుప్రమాదం పొంచి ఉందని తరచూ జరుగుతున్న ఘటనలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతోంది.
తాజాగా నిజామాబాద్‌లో టూ టౌన్ పీఎస్ పరిధిలోని ఓ కాలనీకి చెందని బాలికపై శుక్రవారం లైంగికదాడి జరిగింది. మధ్యాహ్నం సమయంలో బాలిక కిరాణ షాపునకు వెళ్లి తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి ఆమెను అడ్డగించాడు. అనంతరం తనకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. తనపై జరిగిన దారుణాన్ని బాలిక పేరెంట్స్‌కు చెప్పడంతో వారు స్థానిక పోలీస్ స్టేషనల్లో ఫిర్యాదు చేశారు.దీంతో కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.