గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనను ఉద్దేశించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు హీరోయిన్ పూనమ్ కౌర్. 28 కెమెరాలు, 300 వీడియోలు.. అసలు ఏపీలో ఏం జరుగుతుందో చూడండి అంటూ బర్కాదత్ కు ట్యాగ్ చేసింది. ” ప్రియమైన అమ్మాయిలారా.. నేను మీలో ఒకరిగా.. ఒక కూతురుగా ఈ లేఖ రాస్తున్నా.
మీ తల్లిదండ్రులు మిమ్ములను ఎన్నో ఆశయాలతో బయటకు పంపుతున్నారు. కానీ బయట మీకు జరుగుతున్న పరిణామాలు తెలిసి నేను బాధపడుతున్నాను. మీకు జరిగిన ఈ పరిస్థితి చాలా దారుణం. విద్యార్థి సంఘాలు ఐక్యంగా పోరాడితే నిజం బయటకు వస్తుందని నేను చెప్పాలనుకుంటున్నాను. చట్టం బలహీనులకు బలంగా, బలవంతులకు బలహీనంగా వర్తించబడుతుంది అనే నానుడి మనదేశంలో ఇటీవల జరిగిన అనేక సంఘటనలలో గుర్తుకు తెచ్చాయి.
వ్యక్తులు ఎంతటి శక్తివంతులైన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే.. వారు ఏ పార్టీకి చెందిన వారైనా మీరు వదలకండి. ఒక అమ్మాయి ఎంతోమంది విద్యార్థినులను ప్రమాదంలోకి నెట్టడం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఎవరిని విడిచిపెట్టకూడదు. వారికి గుణపాఠం చెప్పండి” అని ట్వీట్ చేసింది.