ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. విపరీతంగా వర్షాలు కురుస్తుండటంతో ఓ ఇంటిపై కొండ చరియలు విరిగి పడ్డాయి. క్రీస్తు రాజపురంలో రెండు ఇళ్ల పై కొండ చరియలు పడటంతో పెను ప్రమాదం తప్పింది. సున్నపు బట్టిల దగ్గర కొండ చరియలు పడి రెండిళ్లు ధ్వంసమయ్యాయి. ఇళ్లల్లో చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటువైపు ఎవ్వరూ వెల్లకుండా అధికారులు అప్రమత్తం చేసారు.
కొండ చరియలు విరిగి పడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య నాలుగు కి చేరింది. మృతుల్లో ఓ మహిళా, ఇద్దరు పురుషులు, ఓ యువతి ఉన్నారు. శిథిలాల కింద మరొకరి మృతదేహం కూడా ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జేసీబీలు, పొక్లెయినర్లతో సహాయక చర్యలు కొనసాగుతుండగానే మట్టి పెళ్లలు పడుతున్నాయి. జేసీబీలు, పొక్లెయినర్లను సిబ్బంది వెనక్కి తీసుకెళ్లారు. ప్రభుత్వం తరపున మరణించిన వారికి రూ.5లక్షల పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోవడం చాలా బాధకరం అన్నారు.