Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ వద్ద 3 గేట్లు డ్యామేజ్ !

-

Prakasam Barrage: విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పై నుంచి కూడా భారీగానే వరద వస్తోంది. ఈ తరుణంలోనే.. కృష్ణమ్మకు వరద పోటుతో కొట్టుకొచ్చేస్తున్నాయి బోట్లు. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు వరద ప్రవహంలో కొట్టుకొచ్చాయి బోట్లు. ఈ తరుణంలోనే.. ప్రకాశం బ్యారేజీలోని 3 గేట్ల కు ఢీకొన్నాయి బోట్లు.

Scenes of broken first three gates out of 70 gates at Prakasam Barrage

అయితే.. బోట్లు ఢీకొనడంతో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతంలో డామేజ్ అయింది. మూడు గేట్లు కూడా డ్యామేజ్‌ అయినట్లు సమాచారం అందుతోంది. ఇక అటు కృష్ణా నది వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 11,25,876 క్యూసెక్కలుగా ఉంది. నదీ పరీవాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని… కాలువలు,కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని కోరారు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్.

Read more RELATED
Recommended to you

Latest news