వాహనదారులకు హెచ్చరిక.. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లొద్దు !

-

వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ అస్సలు వెళ్లకూడదని Addl. కమీషనర్ ఆఫ్ పోలీస్ , ట్రాఫిక్, హైదరాబాద్ పి. విశ్వ ప్రసాద్ ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, ఆంధ్రప్రదేశ్‌లోని చిల్లకల్లు నందిగామ వద్ద NH 65 పై వర్షం నీరు ఉంది.

Warning to motorists Do not go to Vijayawada from Hyderabad

ఇక సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే మార్గంలో నాయకని గూడెం వద్ద పాలేరు నది పొంగిపొర్లుతోంది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ్ పట్టణం దాటిన తర్వాత రామాపురం ఎక్స్ రోడ్ వద్ద వంతెన కూడా కూలిపోయింది. ఈ తరుణంలోనే… పౌరులు తమ ప్రయాణాన్ని వాయిదా వేయాలని అభ్యర్థించారని Addl. కమీషనర్ ఆఫ్ పోలీస్ , ట్రాఫిక్, హైదరాబాద్ పి. విశ్వ ప్రసాద్. అత్యవసర మరియు అనివార్య పరిస్థితులలో, ప్రయాణికులు వెళ్లాలని సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news