తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి వరకు 177 రైళ్లను రద్దు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే..ఇవాళ ఉదయం నుంచి 96 రైళ్లను రద్దు చేసింది. నిన్న రాత్రి వరకు 120 రైళ్ళను దారి మళ్ళించారు. ఇవాళ ఉదయం నుంచి 22 రైళ్లను దారి మళ్ళించారు. నిన్న రాత్రి వరకు 9 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది ఇవాళ దాదాపుగా 10 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు అధికారులు.
భారీ వర్షాల తెలుగు రాష్ట్రాల మధ్య రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తల్ల పూసలపల్లి లో వరద ఉధృతికి కొట్టుకుపోయింది రైల్వే ట్రాక్. సిగ్నల్ పోల్ విరిగి పడింది. రైల్వే ట్రాక్ కొట్టుకు పోవడంతో సంఘమిత్ర, మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. ఇక వర్షాల కారణంగా కొన్ని రైళ్లను రద్దు మరికొన్నింటిని దారి మళ్లించింది దక్షిణ మధ్య రైల్వే. ఏపీకి వెళ్లే రైళ్ల సమాచారం కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ , సికిం ద్రాబాద్ , కాజీ పేట్, వరంగల్, ఖమ్మం , విజయవాడ, రాజమండ్రి లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశారు.