‘అల.. వైకుంఠపురములో’ అల్లు అర్జున్ వార‌సులు..

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ నిర్మించారు. త్రివిక్రమ్, బ‌న్నీ
కాంబోలో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్ చిత్రాలు రాగా.. హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యారు. సంక్రాంతి బరిలోకి దిగేందుకు జనవరి 12 థియేటర్లలోకి రాబోతోంది అల వైకుంఠపుములో. ఈ మూవీ విడుదలకు దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది యూనిట్.

ఇక‌ ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ అంచనాలను రెట్టింపు చేయడానికి తాజాగా చిత్ర ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సోమవారం రాత్రి జరిగిన ‘అల వైకుంఠపురములో’ మ్యూజికల్ కాన్సెర్ట్‌లో ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో బ‌న్నీ వారసులు అల్లు అయాన్, అర్హలను కూడా చూపించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ స్వయంగా వెల్లడించారు. అల వైకుంఠపురములో మ్యూజిక్ కాన్సెర్ట్‌లో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్ టైమ్ నా సినిమాలో యాక్ట్ చేసిన సూపర్ స్టార్ అల్లు అయాన్‌కి, అందరికంటే మోస్ట్ ఇంటెలిజెంట్ బ్రిల్లియంట్ స్టార్ అర్హకి థ్యాంక్స్ చెప్పారు.

వాళ్లు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మేం పారిస్ నుంచి ఫోన్ చేయగానే మాకు కాల్షీట్లు ఇచ్చారు. రెండు గంటలు మాత్రమే పనిచేశారు. ఆ రెండు గంటల కోసం బోలెడంత ప్రొడక్షన్ కాస్ట్ అయ్యింది. అరవింద్ గారు, చినబాబు గారు మా వైపు పెద్ద పెద్ద కళ్లతో చూశారు. అయినప్పటికీ కూడా వాళ్లు స్టార్స్.. స్టార్స్‌లానే ఉన్నారు. వాళ్లు మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని త్రివిక్ర‌మ్ చెప్పారు. అయితే ఏ పాత్రల్లో క‌నిపించ‌బోతున్నారు.. ఎలా క‌నిపించ‌బోతున్నారో తెలియాలంటే జ‌న‌వ‌రి 12న సినిమా చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news