లోకేష్ టార్గెట్ గా మాజీ మంత్రి అనిల్ సెటైర్లు.. పొలిటికల్ హీట్ పెంచేసిన పోస్ట్..

-

మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ ఏం మాట్లాడినా.. సంచలనం అవుతుంది.. ప్రత్యర్థులు కలవరపడేలా చేస్తుంది.. వైసీపీ అధినేత జగన్ ని ఎవరైనా విమర్శిస్తే.. ఒంటి కాలి మీద లేచే అనిల్.. కొద్ది రోజులుగా సైలెంట్ మోడ్ లో ఉన్నారు.. తనని ఎవరైనా విమర్శించినా లైట్ తీసుకుంటున్నారు.. ఈ క్రమంలో మంత్రి లోకేష్ ని ఉద్దేశించి అయన చేసిన ట్విట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది..

కృష్ణా నది, బుడమేరు వరదలతో విజయవాడ అతలాకుతలమవుతుంది. బెజవాడ లోని చిట్టి నగర్, సింగ్‌ నగర్, కబేళా, సితార సెంటర్, న్యూ రాజరాజేశ్వరిపేట తదితర ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి.విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీ ఎత్తున వరద వస్తోంది. ఈ క్రమంలో పడవలు ప్రవాహ వేగానికి కొట్టుకుపోయి ప్రకాశం బ్యారేజీ గేట్లకు గుద్దుకున్నాయి. దీంతో ఒక గేటు కొంతమేర ధ్వంసమైంది.. టిడిపి తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సహాయ చర్యలను ముమ్మరం చేసింది.. జగన్ ఇప్పటికే రెండుసార్లు పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు.. ప్రకాశం బ్యారేజ్ గేటును ఓ పడవ ఢీ కొట్టిన నేపథ్యంలో.. ఆ ఫోటోని మాజీ మంత్రి అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.. లోకేష్ కి కౌంటర్ ఇచ్చారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన వరదలకు కృష్ణా కరకట్టలో ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసం మునిగింది. తమ నివాసాన్ని ముంచడానికే ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని విడుదల చేయకుండా భారీ ప్రవాహం వచ్చే వరకు ఎదురుచూశారని అప్పట్లో లోకేష్ విమర్శించారు. ఇప్పుడు ఇదే అంశాన్ని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఎత్తిచూపారు. తమ ప్రభుత్వ హయాంలో వరదలొస్తే చంద్రబాబు నివాసాన్ని ముంచడానికి తాము ప్రయత్నించామని లోకేశ్‌ ఆరోపించారని అనిల్‌ గుర్తు చేశారు. బ్యారేజీకి పడవలు అడ్డుపెట్టి నీటి ప్రవాహాన్ని అడ్డుకున్నామని ఆరోపణలు చేశారన్నారు.

మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని.. అయినా చంద్రబాబు ఇల్లు ఎలా మునిగిందని నిలదీశారు. బ్యారేజీ వద్దకు పడవలు ఎలా కొట్టుకువచ్చాయని ప్రశ్నించారు. ఈ పోస్టుకు అప్పట్లో నారా లోకేశ్‌ చేసిన ట్వీట్‌ ను, బ్యారేజీ వద్ద అడ్డంగా ఉన్న పడవల ఫొటోలను జత చేశారు. అనిల్ చేసిన ట్వీట్ కి టిడిపి నేతలు ఏమని కౌంటర్ ఇవ్వాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట.. బెజవాడలో వరదల కేంద్రంగా రాజకీయం హాట్ టాపిక్ గా మారిందనే ప్రచారం జరుగుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news