వైరల్ వీడియో; ఆ యువకులు వారి కారుని ఎందుకు ఉపయోగించారో తెలిస్తే…!

-

ఆస్ట్రేలియా కార్చిచ్చులో భారీగా కాలిపోయిన జంతువుల్లో కొలాస్ ఒకటి. కోతి ఆకారంలో ఉండే ఈ జీవులు మంటల ధాటికి చాలా వరకు మరణించాయి. దాదాపు 25 వేలకు పైగా కొలాస్ మరణించాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో గాయపడిన కోలాస్‌ను రక్షించడానికి ఆస్ట్రేలియాలోని వాలంటీర్లు తమ కార్లను ఉపయోగిస్తున్నారు. ఆస్ట్రేలియా అంతటా బుష్ మంటలు చెలరేగడంతో,

కొంతమంది వాలంటీర్లు కోలా ఎలుగుబంట్లను రక్షించి, వారి కార్లలో మంటల నుండి వాటిని రక్షించారు. ది టెలిగ్రాఫ్ ప్రకారం, కంగారూ ద్వీపంలో కోలాలకు సురక్షిత ప్రాంతంగా పరిగణించబడింది, ఎందుకంటే దాని జనాభా క్లామిడియా మహమ్మారి నుండి తప్పించుకుంది. అయితే ఈ అగ్ని ప్రమాదాలలో అవి మరణించడం పర్యావరణ శాస్త్రవేత్తలలో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఇద్దరు టీనేజ్ యువకులు 19 ఏళ్ల మీకా మరియు 18 ఏళ్ల కాలేబ్.

ఈ శనివారం పోస్ట్ చేసిన ఒక వీడియోలో, వారి కారుని కొలాస్ ని రక్షించడానికి వినియోగించారు. కారు సీట్లపై ఐదు కోలాస్ ఉన్నాయి. మరియు స్టీరింగ్ దగ్గర ఒకటి ఉండగా, కారు వెనుక భాగంలో ఒక తల్లి కోలా కనిపిస్తుంది. ఈ వీడియోను వారి బంధువు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. “ఆస్ట్రేలియాలో భయంకరమైన బుష్‌ఫైర్‌ల మధ్య, మా బంధువులు బయటకు వెళ్లి, వీలైనన్ని కోలాస్‌ను రక్షించారు.” అని పేర్కొన్నారు. దాదాపు 20 కొలాలను వారు కాపాడారు. చాలా వరకు కాలిపోయిన వాటిని మాత్రమే రక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news