కాంగ్రెస్ ప్రభుత్వం మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తుంది – కౌశిక్‌ రెడ్డి

-

నా ఫోన్‌ ను రేవంత్‌ సర్కార్‌ ట్యాపింగ్‌ చేస్తోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఫైర్ అయ్యారు. జమ్మికుంట పట్టణంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. నా ఫోన్ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని… ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపిల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతుందని ఆరోపణలు చేశారు. మేము ఎక్కడికి వెళ్లిన వారికి సమాచారం ఉంటుందని… మా పర్సననల్ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందని నిలదీశారు.

Hujurabad MLA Padi Kaushik Reddy media conference in Jammikunta town.

సిపి టెలి కాన్ఫరెన్స్ పెట్టుకోవడం పర్సనల్ విషయమని… సిపి ఫోన్ కూడా ట్యాప్ జరుగుతోందని ఆగ్రహించారు. మా ఫోన్ చేయరని గ్యారంటీ ఏమిటి ? అని ప్రశ్నించారు. పోలీస్ యంత్రాంగం ఒక సెక్యూరిటీ వింగ్ అని తెలిపారు. ప్రజల సేఫ్టివింగ్, ఆలాంటి పోలీస్ ల ఫోన్ ట్యాప్ చేయడం సిగ్గు చేటు అని ఫైర్‌ అయ్యారు. మావి కూడా ట్యాపింగ్ చేస్తున్నారు అనేందుకు ఇదే ఉదాహరణ అని… సీపీ గారు సీఐకి కాన్ఫరెన్స్ పెడుతలేరని మంత్రికి, ఎమ్మెల్యేకు ఎలా తెలుసన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news