జియో యూజర్లకు గుడ్ న్యూస్.. మరిన్ని సరికొత్త ప్లాన్స్!

-

రిలయన్స్ జియో తన ప్రియమైన వినియోగదారులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది.జియో 8 వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 5 నుంచి 10వ తేదీల మధ్య కొన్ని రీచార్జి ప్లాన్లపై స్పెషల్ ఆఫర్లు ప్రకటించింది. రూ.899(90 రోజులు), రూ.999(98రోజులు), రూ.3,599 (365రోజులు)తో రీచార్జ్ చేసుకుంటే రూ.700 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో 10 ఓటీటీలు, 3 నెలల జొమాటో గోల్డ్ మెంబర్ షిప్‌, 28 రోజుల వ్యాలిడిటీతో రూ.175 విలువైన 10జీబీ డేటా వోచర్ పొందవచ్చని జియో ప్రకటించింది.

అయితే, ఇటీవల జియో టారిఫ్ ప్లాన్లను పెంచడంతో వినియోగదారులు ఆ ప్లాన్లను భారంగా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇతర టెలికాం నెట్వర్కుల్లోకి మారేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. మరికొందరు టారిఫ్ తక్కువగా అందిస్తున్న ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్‌లోకి మారేందుకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోటికి పైగా జియో, ఎయిర్ టెల్ టెలికాం కస్టమర్లు బీఎస్ఎన్‌ఎల్‌లోకి మారినట్లు తెలుస్తోంది.కస్టమర్లు ఇతర నెట్వర్కుల్లోకి మారకుండా ఉండేందుకు జియో సరికొత్త ప్లాన్లను తీసుకొస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news