ఒకే హెలికాప్ట‌ర్‌లో బండి, భట్టి.. ఖమ్మంలో ఏరియల్ సర్వే!

-

తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే. ముంపు గ్రామాల బాధితులు ఇళ్లల్లోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోని సామగ్రి మొత్తం తడిచిపోవడంతో తమను ఆదుకోవాలని, ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇప్పటికే రూ.10వేలు బాధితులకు ప్రభుత్వం తక్షణ సాయం అందించగా.. సాయం మొత్తాన్ని పెంచాలని బాధితులు కోరుతున్నారు.

ఈ క్రమంలోనే వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్ర బృందం పరిశీలిస్తోంది. కేంద్రమంత్రి బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఒకే హెలికాప్టర్‌లో ఏరియల్ వ్యూ కోసం ఖమ్మం జిల్లాకు బయలుదేరారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్‌తో కలిసి వరద నష్టంపై ఏరియల్ సర్వే నిర్వహించారు.ఈ సర్వేలో మంత్రులు పొంగులేటి, తుమ్మల సైతం పాల్గొన్నారు. కేంద్రమంత్రికి వరద నష్టంపై వివరించాక తిరిగి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.అనంతరం శివరాజ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్‌లో భేటీ కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news