ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థుల కోసం కొత్తగా నిర్మించనున్న 2 హాస్టల్ భవనాలకు తెలంగాణ ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు.10,286 చదరపు అడుగుల విస్తీర్ణంలో డెంటల్ హాస్టల్ నిర్మించనున్నట్లు తెలిపారు. వీటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే టెండర్లను సైతం పిలిచింది. ఏడాది సమయంలో ఈ రెండు బిల్డింగులను పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉస్మానియా విద్యార్థులను మరిచారని, వారి కోసం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు నేటికి విడుదల చేయలేదని వారు పలుమార్లు నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పాత వాటి స్థానంలో కొత్త హాస్టల్ భవనాల నిర్మాణానికి మంత్రి దామోదర రాజనర్సింహ ఓకే చెప్పినట్లు సమాచారం.