పారాలింపిక్స్ లో కాంస్య పతక విజేతగా నిలిచిన దీప్తి జీవాంజికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ నజరానా అందిస్తున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా అభినందనలు తెలిపారు. దీప్తికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు (గ్రూపు2 స్థాయి), రూ.కోటీ నగదు, వరంగల్ లో 500 గజాలు ఇంటి స్థలాన్ని కేటాయించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే ఆమె కోచ్ కు రూ.10లక్షల నగదు బహుమతిని ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇటీవలే ముగిసినటువంటి పారాలింపిక్స్ లో అథ్లెట్ దీప్తి జీవాంజి 400 మీటర్ల టీ-20 విభాగంలో ఆమె కాంస్య పథకం సాధించింది. దీంతో ఆమెను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా తన కార్యాలయానికి ఆహ్వానించి అభినందించారు. సత్తా చాటే అథ్లెట్లు, ఆటగాళ్లను తమ ప్రభుత్వం కచ్చితంగా గౌరవిస్తుందని.. వారు మరిన్నీ విజయాలు సాధించేందుకు ప్రోత్సహిస్తామని గతంలోనే తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం దీప్తి విజయంతో హర్షం వ్యక్తం చేశారు.