ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు

-

విజయవాడను వర్షం వీడడం లేదు. శనివారం కొన్ని గంటల పాటు విజయవాడలో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. అలాగే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణ బేసిన్ లోని ప్రాజెక్టులలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ప్రకాశం బ్యారేజ్ 65 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 3.2 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి పెద్ద ఎత్తున నీరు దిగువకు విడుదల చేస్తుండడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజీకి వరద పెరుగుతూ ఉండడంతో గేట్లను పరిశీలించారు సీఎం చంద్రబాబు నాయుడు.

గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడుతో మాట్లాడారు చంద్రబాబు. కౌంటర్ వెయిట్ల వద్ద జరుగుతున్న పనులపై ఆరా తీశారు. డ్యాం భద్రతకు తీసుకోవలసిన చర్యలు చేపట్టాలని కన్నయ్య నాయుడుకి సూచించారు సీఎం. ఇక రానున్న రెండు రోజులలో గేట్ల వద్ద చిక్కుకున్న బోట్లను తొలగిస్తామని, అయితే అది కష్టంతో కూడుకున్నది అని కన్నయ్య నాయుడు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news