పీఎఫ్ ఉన్న ఉద్యోగులకు రూ.9 వేల పెన్షన్..!

-

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకి గ్యారెంటీ పెన్షన్ కల్పించేలా యూనిఫాడ్ పెన్షన్ స్కీమ్ ని తీసుకువచ్చింది. ఈ స్కీం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గ్యారెంటీ పెన్షన్ వస్తుంది. ఈ స్కీమ్ ఏప్రిల్ ఒకటి 2025 నుంచి అమలులోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వ యుపిఎస్ ప్రకటించిన క్రమంలో ఎంప్లాయిస్ ప్రొవైడ్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోని ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు నుంచి ఓ డిమాండ్ వస్తోంది. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీం కింద వచ్చే కనీస పెన్షన్ ని పెంచాలని వారు కోరారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కీలక ప్రతిపాదన వెళ్ళింది.

ఎంప్లాయిస్ పెన్షన్స్ స్కీమ్ ద్వారా అందించే కనీస పెన్షన్ ని 9000 కి పెంచాలని లేఖ ద్వారా కోరారు. డిఏ పెంపు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈపీఎస్ పరిధిలో 75 లక్షల మంది పెన్షనర్లు ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈపీఎఫ్ పెన్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ చెప్పిన దానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా 23 లక్షల మందికి లబ్ధి చేకూరాలని ఉంది.

కనీస పెన్షన్ పెంపు విషయాన్ని ప్రధాన నరేంద్ర మోడీ వద్దకు తీసుకువెళ్లాలని చెన్నై పెన్షనర్ల సంఘం భావిస్తోంది. జూలై నెలలో ఈపీఎస్ 95 పెన్షనర్ల బాడీ నేషనల్ కమిటీ ఢిల్లీలో నిరసనలు చేపట్టింది. కనీస పెన్షన్ 7,500 కు పెంచాలని డిమాండ్ చేస్తోంది. ఈ కమిటీ మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తుంది. ఈ కమిటీలో 78 లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు 7.5 కోట్ల మంది ఇండస్ట్రియల్ సెక్టార్ ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ఈపీఎస్ స్కీమ్ ద్వారా కనీస పెన్షన్ అందించడానికి 60 నెలల బేసిక్ శాలరీతో సర్వీస్ పీరియడ్ని గుణించి దానిని 70 తో భాగిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news