తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల టైంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను విస్మరించడమే కాకుండా రుణమాఫీని కూడా సక్రమంగా నిర్వర్తించలేదని బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15లోపు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేస్తానని ప్రకటించి మాట నిలబెట్టుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్నారని, అదంతా పెద్ద బూటకమని తేలిపోయిందని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
వందశాతం రుణమాఫీ అయ్యిందని పోజులు కొట్టిన సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెంట్లవెల్లి వెళ్లి రైతుల గోడు వినాలని, వారి డిమాండ్లు తీర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘రుణమాఫీ పూర్తి అని చెప్పిన సీఎం మాటలు బూటకం అనేదానికి నాగర్ కర్నూల్ జిల్లాలోని పెంట్లవెల్లి సజీవ సాక్ష్యం అని అన్నారు.499 మంది రైతుల్లో ఒక్కరంటే ఒక్కరికీ కూడా రుణమాఫీ కాకపోవడం పచ్చిమోసం కాక మరేమిటి? ప్రశ్నించారు. వీరికి రుణమాఫీ ఎందుకు జరగలేదో సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని’ కేటీఆర్ ట్వీట్ ద్వారా డిమాండ్ చేశారు.