డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు.. 254 కిలోల గంజాయి స్వాధీనం..!

-

తెలంగాణలో డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను నిర్మూలించాలని ప్రభుత్వం ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు. తెలంగాణ డ్రగ్స్ లేకుండా చేయాలని సూచించారు. పోలీసుల తనిఖీలలో కొంత మంది పట్టుబడుతున్నారు. ఈ నేపత్యంలోనే టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ, ఇతర పోలీస్ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలను చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, ఎయిర్ ఫోర్టులు, పట్టణాల్లోని ప్రధాన కూడల్లలో వాహనాలను నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. 

డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. తాజాగా ఐదుగురు సభ్యులు కలిగిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 254 కిలోల గంజాయితో పాటు 2 కార్లు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.కోటి విలువైన గంజాయి ఇతర వస్తువులను సైతం సీజ్ చేశారు. అరకు గంజాయిని కొనుగోలు చేసి.. ముంబయి, యూపీకి అక్రమంగా తరలిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news