వచ్చే ఏడాది చివరికీ సాప్ట్ వేర్, పశు వైద్య నిపుణులకు ఉద్యోగాలు కల్పించనున్నట్టు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాయదుర్గంలో జోయెటిస్ గ్లోబల్ సామర్థ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పశు వైద్య రంగంలో ప్రపంచ దిగ్గజం జోయెటిస్ ప్రవేశంతో లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ కొత్త మైలు రాయిని దాటిందన్నారు.
పశువులు, పెంపుడు జంతువుల ఔషదాలు, పోషకాల ఉత్పత్తిలో జోయెటిస్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని.. ఆ సంస్త సామర్థ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి బిజినెస్ ఆపరేషన్స్, డేటా మేనేజ్ మెంట్, పరిశోదన వంటి కార్యకలాపాలను నిర్వహిస్తుందని తెలిపారు. ఇటీవలే అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి జోయెటిస్ యాజమాన్యంతో చర్చలు జరిపామని గుర్తు చేశారు. అతి తక్కువ సమయంలోనే సామర్థ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జీసీసీతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెటర్నరీ వైద్యులు, పెంపుడు జంతువుల యజమానులు, పశులవులు, జీవాల పెంపకదారులకు ఔషదాల సరఫరాకు, ఆరోగ్య నిర్వహణపై ఎప్పటికప్పుడు సూచనలు అందించే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు.