జగన్‌ పిఠాపురం పర్యటనపై నాదెండ్ల సెటైర్లు..అదంతా పెద్ద షోనే !

-

జగన్‌ పిఠాపురం పర్యటనపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సెటైర్లు పేల్చారు. మూడు నెలల కూటమి పాలన చూస్తేనే జగన్ తట్టుకోలేక పోతున్నాడని… ప్రజలను ఆదుకోవాలన్న మనసు జగన్ కు ఉందా అని ప్రశ్నించారు. జగన్, కానీ వైసీపీ నాయకులు కానీ ప్రజలుకు ఏ విధంగా సేవలు అందించారో చెప్పాలని.. పిఠాపురం వెళ్లి పెద్ద జ్ఞాని లాగా పది పేపర్లు చేతిలో పెట్టుకుని జగన్ హడావుడి చేశారని ఆగ్రహించారు. వైసీపీ పాలనలో విపత్తులు వస్తే.. పవన్ కళ్యాణ్ ఏనాడూ రాజకీయ విమర్శలు చేయలేదని గుర్తు చేశారు.

Nadendla satires on Jagan’s visit to Pithapuram

పిఠాపురంలో మీ జగనన్న కాలనీ ఎందుకు పరిశీలించలేదని నిలదీశారు. ఏలేరు గురించి జగన్ ఇప్పుడు మాట్లాడుతున్నారు.. ఐదేళ్లు ఎందుకు చేయలేదని నిలదీశారు. వర్షాలు ఎక్కువుగా పడినందువల్ల చేయలేదని చెప్పడానికి సిగ్గుండాలన్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా, పార్టీ అధ్యక్షునిగా ఉన్న జగన్.. మీ పార్టీ శ్రేణులను వరద సహాయక చర్యలు ఎందుకు చేపట్టలేదన్నారు. లీడర్ అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాగా స్పందించే మనసు ఉండాలని చురకలు అంటించారు. కాగితాలు చేతిలో పెట్టుకుని ఊగిపోతే.. షో మెన్ తప్ప.. జగన్ లీడర్ అనిపించుకోలేడన్నారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.

Read more RELATED
Recommended to you

Latest news