నెల్లూరు జిల్లా కావలి టీడీపీలో వర్గపోరు!

-

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ టిడిపిలో వర్గ పోరు భగ్గుమంది. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు మాలేపాటి సుబ్బానాయుడు. దగదర్తి లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే తీరుపై సుభానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు జైల్లో ఉంటే టపాసులు కాల్చి పండగ చేసుకున్న వ్యక్తి ద్వారా దగదర్తి మండలంలో పార్టీ కార్యక్రమాలు చేయిస్తారా..? అంటూ ప్రశ్నించారు సుబ్బానాయుడు.

ఈ పార్టీ మాది.. మాది కాదనే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదని అన్నారు. టిడిపి అంటే మాలేపాటి.. మాలేపాటి అంటేనే టీడీపీ అన్నారు సుబ్బానాయుడు. ఈ విషయాన్ని తాను చంద్రబాబు, లోకేష్ దగ్గరే తేల్చుకుంటానని అన్నారు. గతంలో వైసీపీ నేతలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కరుణాకర్ విషయంలో తాను పోరాటం చేశానని.. లోకేష్ యువగళం పాదయాత్రను విజయవంతం చేశానని చెప్పుకొచ్చారు.

కావలి మాజీ ఎమ్మెల్యే అవినీతిని బట్టబయలు చేసి ధర్నాలు, పోరాటాలు చేశానన్నారు. నియోజకవర్గంలో టిడిపి పార్టీ లేనప్పుడే తాను వచ్చి 17 కోట్లు ఖర్చు పెట్టానని వ్యాఖ్యానించారు. అంతేకాదు మమ్మల్ని పక్కకు పెట్టే ఆలోచన ఎవరికీ వచ్చినా సహించమని హెచ్చరించారు సుబ్బానాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news