హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూలుస్తోన్న రేవంత్ : బీఆర్ఎస్

-

హైదరాబాద్ మహానగరం రియల్ ఎస్టేట్‌కు పెట్టింది పేరు. బెంగళూరు, ముంబై వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్‌లో అద్భుతమైన గణాంకాలను నమోదు చేస్తూ వస్తోంది. దేశవ్యాప్తంగా నెంబర్ వన్ జాబితాలో ఉంది. అయితే, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వలన నగరంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలే అవకాశం ఉందని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్నది.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతిసేందుకు కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ కంకణం కట్టుకున్నారని బీఆర్ఎస్ విమర్శలకు దిగింది. ఎక్స్ ద్వారా ఆదివారం స్పందిస్తూ..‘ మొన్న హైడ్రా అంటూ హైడ్రామా. నిన్న మా నేతల మీద దాడులు. ఇలా రోజుకో సమస్య సృష్టించి నగర అభివృద్దిని వెనక్కి నెట్టడానికి కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోంది. పేదల ఇళ్లను కూల్చుతూ వారికి నిలువ నీడ లేకుండా చేస్తోంది. తెలివి తక్కువ నిర్ణయాలతో రియల్ ఎస్టేట్‌ను కూల్చేందుకు సీఎం పన్నాగం పన్నుతున్నారు’ అని ఘాటు విమర్శలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news