కొత్త రేషన్ కార్డులు.. దరఖాస్తుల అర్హతలు ఇవే! : మంత్రి ఉత్తమ్

-

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు వేగంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రేషన్ కార్డుల ప్రక్రియ కోసం మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ సైతం పూర్తయింది. ఇందులో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. మరోసారి కేబినెట్ సబ్ కమిటీ భేటీ ఉంటుందని అందులో పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. రేషన్ కార్డుల కోసం పలు రాజకీయ, ప్రముఖుల నుంచి సలహాలు, సూచనలను సైతం పరిగణిస్తామని తెలిపారు.

అయితే, కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. అప్లికేషన్ దారులకు వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షలోపు ఉండాలి. పట్టణాల్లో రూ.2 లక్షల లోపు ఉండాలి. 3.5 ఎకరాలలోపు తడి, 7.5 ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్నవారు అర్హులుగా తేల్చారు. అయితే, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌లలో ఆదాయ పరిమితులు పరిశీలించామని, రాష్ట్రంలోనూ పరిమితి పెంచాలా? తగ్గించాలా? ప్రస్తుత నిబంధనలే కొనసాగించాలా? అనేదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news