దశబ్దకాలంగా తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదు : జీవన్ రెడ్డి

-

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్స్ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు వారి అర్హతకు అనుగుణంగా కల్పించాలని భావనతో సీఎం రేవంత్ సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం గా ఆరంభించడం హర్షనియం. గల్ఫ్ కార్మికుల మృతుల కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సహాయం కొరకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు అని పేర్కొన్నారు.

అలాగే దశబ్దకాలం BRS ప్రభుత్వమీదే ఉండే.. అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటులో భిన్న అభిప్రాయం లేదు. డిసెంబర్ 9న సచివాలయంలోనే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ ఆలోచన విధానాన్ని రాజకీయాలకు అతీతంగా సమర్థించాలి కానీ విమర్శలు చేయకూడదు. ఉత్తర తెలంగాణలో ఉన్న రెండు షుగర్ ఫ్యాక్టరీలకు నిధులు మంజూరయ్యాయి త్వరలోనే ప్రారంభిస్తాం అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news