అన్ని రకాల బ్రాండ్లను కేవలం రూ. 99కే : కొలుసు పార్దసారధి

-

గత ప్రభుత్వ ఎక్సైజ్ విధానం లోపభూయిష్టంగా ఉంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా గత ప్రభుత్వ మద్యం విధానం ఉంది అని మంత్రి కొలుసు పార్దసారధి అన్నారు. నాణ్యమైన మద్యాన్ని అన్ని రకాల బ్రాండ్లను కేవలం రూ. 99కే అందించే నిబంధనకు కెబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో రూ. 120కే ఇచ్చిన మద్యాన్ని కొత్త పాలసీ ప్రకారం రూ. 99కే అందిస్తాం అని పేర్కొన్నారు. అలాగే గీత కార్మికులకు పది శాతం లిక్కర్ షాపుల కేటాయింపునకు నిర్ణయం తీసుకున్నాము. అప్లికేషన్ ఫీజు-రూ. 2 లక్షలు, రెండేళ్ల కాలపరిమితితో ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతి లభిస్తుంది.

ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలకు అనుమతి ఉంటుంది. లైసెన్స్ ఫీజు రూ. 50 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు ఉండేలా కొత్త పాలసీ తీసుకొస్తున్నం. లైసెన్స్ ఫీజును నాలుగు స్లాబుల్లో చెల్లించవచ్చు. 20 శాతం లాభం ఉంచుకునేలా ధరలు ఉంటాయి. ఐదేళ్ల కాలపరిమితితో ఏపీలో 12 ప్రీమియర్ షాపులు వచ్చాయి. ప్రీమియర్ షాపులకు నాన్ రిఫండ్ ఫీజు రూ. 15 లక్షలు. ప్రీమియర్ షాపులకు రూ. 1 కోటి మేర లైసెన్స్ ఫీజు ఉండగా.. తిరుపతిలో ప్రీమియర్ మద్యం దుకాణాలకు అనుమతి లేదు మంత్రి కొలుసు పార్దసారధి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news