సీఎం సహాయ నిధికి కుమారి ఆంటీ రూ.50వేలు విరాళం

-

తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలకు తీవ్ర నష్టం జరిగిన విషయం విధితమే. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు, వరదలకు రైతులు, పేద ప్రజలు చాలా నష్టపోయారు. కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరూ పంట నష్టం, ఆస్తి నష్టం, గొర్రెలు, పశువులు, బర్రెలు చనిపోయాయి. వాటన్నింటికి ప్రభుత్వం తరుపున కొంత ఆర్థిక సహాయం అందజేసింది.

పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు సీఎం సహాయనిధికి ఆర్థిక సహాయం అందజేశారు. చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, బాలకృష్ణ తదితర నటీనటులు సహాయం చేశారు. తాజాగా వంటమాస్టర్ కుమారి ఆంటీ కూడా రూ.50వేలు తనవంతుగా సహాయం చేసి అందరినీ ఆశ్యర్య పరిచింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కుమారి ఆంటీ సీఎం రిలీఫ్ ఫండ్ కి సహాయం రూ.50వేల చెక్కును అందజేసింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీని సత్కరించారు. ప్రస్తుతం ఈ ఫోటొలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news