అన్నదాతల వార్నింగ్.. ప్రజాభవన్ ఎదుట బారికేడ్లతో భద్రత!

-

ఎలాంటి షరతులు విధించకుండా తమకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ చలో ప్రజాభవన్‌కు రైతులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ప్రజాభవన్ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజా భవన్ ఎదుట పోలీసులు పెద్ద ఎత్తున బారికేడ్లను మొహరించి సెక్యూరిటీని టైట్ చేశారు.

మరో వైపు చలో ప్రజా భవన్ పిలుపు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, రైతు సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు.ప్రతీ కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ సర్కార్ గతతంలో హామీ ఇచ్చిందని, ఇప్పటివరకు కేవలం రూ.2 లక్షల లోపు రుణాలు మాత్రమే మాఫీ చేసిందన్నారు. అయితే, రుణమాఫీ జరగని రైతులు ఒత్తిడికి, ఆందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పలువురు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news