ఆర్టికల్ 370పై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు

-

జమ్ముకాశ్మీర్‌లో గతంలో అమలులో ఉన్న ఆర్టికల్ 370ని మోడీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జమ్ముకాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తాజాగా ఆర్టికల్ 370పై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 విషయంలో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) కూటమి వైఖరితో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఏకీభవిస్తుందన్నారు.కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీ కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

తాజాగా పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ ఎప్పుడూ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే వారివైపే నిలుస్తుందని మండిపడింది.‘పాకిస్థాన్ ఒక ఉగ్రదేశం.కశ్మీర్‌పై కాంగ్రెస్, ఎన్సీ వైఖరిని సమర్థిస్తుంది. గురుపత్వంత్ పన్నూన్ నుంచి పాక్ వరకు, రాహుల్, కాంగ్రెస్ నిరంతరం భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధమైన వారి వైపు ఎలా నిలుస్తారు? అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ‘ఎక్స్’ వేదికగా విరుచుకుపడ్డారు. అయితే, ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని ఎన్సీ హామీ ఇవ్వగా, కాంగ్రెస్ ఈ అంశంపై మౌనంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news