సాధారణంగా అత్త కోడల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఏదో ఒక సందర్భంలో అత్తా కోడలు గొడవ పడుతూ ఉంటారు. అత్త కోడళ్ల రిలేషన్ బాగుండాలంటే మాత్రం ఇలా చేయడం మంచిది. వైవాహిక జీవితం తర్వాత చాలా మార్పు వస్తుంది. అత్త కోడలు మధ్య ఎన్నో గొడవలు వస్తాయి. అలాంటప్పుడు సహనంగా ఉండాలి. లేకపోతే అనవసరంగా సమస్య పెద్దదవుతుంది. అత్త వయసులో పెద్దవారు. కాబట్టి గౌరవంగా సమాధానం చెప్పడం మంచిది, పర్సనల్ ఎటాక్ కాకుండా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. సరైన పదాలని వాడి మాట్లాడండి.
అత్త కోడల మధ్య ఇబ్బందులు తొలగిపోవాలంటే ఒకసారి గొడవ అయిన తర్వాత పాజిటివ్ గా మాట్లాడండి. సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పేసేయండి. పరిస్థితిని సులభంగా పరిష్కరించుకోవాలి. అదే విధంగా మీ అత్తతో కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని ముందే చెప్పేయండి. అటువంటి విషయాలకి ఆమె దూరంగా ఉంటే మీకు పెద్దగా ఎఫెక్ట్ కలగదు. ఎమోషనల్ సపోర్ట్ కోసం మీ భర్త సపోర్ట్ తీసుకోండి. అత్త కోడల మధ్య వివాదాలు రాకుండా ఉండడానికి భర్త హెల్ప్ తీసుకుంటే మంచిది. మీ అత్తని మీరు మిమ్మల్ని మీ అత్త అర్థం చేసుకుంటే ఇద్దరి మధ్య బంధం బాగుంటుంది.
ఒకరినొకరు అర్థం చేసుకోవడం వలన సమస్యలు ఉండవు. అవసరమైతే మీ అత్త సలహా తీసుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరితో ఒకరికి మంచి కమ్యూనికేషన్ ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బంది కూడా రాదు. మీ అత్త మీకు హెల్ప్ చేసినా లేదంటే ఏమైనా మంచి రుచికరమైన వంట చేసినా, మీకోసం ఏమైనా చేసిన కాంప్లిమెంట్ ఇవ్వండి. అప్పుడు ఆమె పాజిటివ్ గా తీసుకుంటారు. ఆమె చేసే పనులు మీద నెగిటివ్ గా రియాక్ట్ అవ్వద్దు. పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి చూడండి. మార్పు మీరే చూస్తారు.