తిరుమల లడ్డూ ప్రసాదంపై రెండు రోజులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే… తిరుమల లడ్డూ ప్రసాదం గురించి సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డినే నేరుగా రంగంలోకి దిగుతున్నారు. నేడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
టీటీడీ లడ్డు ప్రసాదం పై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో దుమారం రేగిన నేపథ్యంలో ఆసక్తిగా మారింది జగన్ ప్రెస్ మీట్. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయంలో.. సీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డూ ప్రసాదం గురించి సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పందించనున్నారు.