ఏడుకొండల వాడే నాతో లడ్డూ వ్యవహారంపై మాట్లాడించాడేమో : చంద్రబాబు

-

గత ప్రభుత్వంలో దేవాలయాల్లో అనేక అపచారాలు జరిగాయి. నాటి ప్రభుత్వం ప్రజల సెంటిమెంట్లతో ఆడుకున్నారు. ప్రజల మనోభావాలకు గత ప్రభుత్వం విలువ ఇవ్వలేదు అని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే దానిపై సమాధానం చెప్పకుండా.. బుకాయించే వాళ్లను ఏమనాలి.. రూ. 320 కిలో ఆవు నెయ్యి ఎలా వస్తుంది.. శ్రీవారికి నైవేధ్యంగా పెట్టే లడ్డూ తయారీలో రివర్స్ టెండర్లు ఏంటి అని ప్రశ్నించారు.

పరమ పవిత్ర పుణ్యక్షేత్రం విషయంలో ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి కదా.. తప్పు చేసింది కాక.. ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని సిగ్గు లేకుండా ఎలా చెపుతారు. ప్రభుత్వం మారిన వెంటనే తిరుమల ప్రక్షాళన చేయమని కొత్త ఈవోకు చెప్పాను. ఆయన అనేక చర్యలు తీసుకున్నారు. లడ్డూ నాణ్యత పెంచారు. పలు కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టారు. లడ్డూ నాణ్యత కోసం నందిని నుంచి నెయ్యి కోనుగోలు చేశారు. ఈవో ప్రక్షాళన చేశారు.. కానీ ఇవన్నీ రోజూ బయటకు వచ్చి చెప్పలేదు. పని చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు ఆ ఏడుకొండల వాడే నాతో లడ్డూ వ్యవహారంపై మాట్లాడించాడేమో.. ఆ దేవుడి నా నోటినుంచి నిజాలు చెప్పించాడేమో అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news