HMDAలో భారీ ఎత్తున స్కాం..అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ పై కేటీఆర్ మరో బాంబ్ పేల్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే లంచావతారాలు…చెలరేగుతున్నాయని ఆగ్రహించారు. నత్తనడకన ఫైళ్లు నడుస్తున్నాయని చురకలు అంటించారు. సాక్షాత్తూ రేవంత్ రెడ్డి వద్దే ఉన్న మున్సిపల్ శాఖ పరిధిలోని హెచ్ఎండీఏలో భారీ ఎత్తున పేరుకుపోతున్న ఫైళ్లు దేనికి సంకేతం? అంటూ ప్రశ్నించారు కేటీఆర్.
కారణాలు లేకుండా ఫైళ్లను తమవద్దే ఎందుకు తొక్కిపెడుతున్నారు అధికారులు? దీని వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో ప్రజలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమతుల్లో అవినీతి నిరోధించేందుకు కేసీఆర్ ప్రభుత్వం టీఎస్-బీపాస్ తెచ్చిందన్నారు. అంతటి పారదర్శక విధానాన్ని కూడా రేవంత్ సర్కారు తుంగలో తొక్కి విచ్చలవిడి అవినీతిని ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ పెద్దలకు అమ్యామ్యాల కోసమే సామాన్య ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆగ్రహించారు కేటీఆర్.