అసెంబ్లీ సాక్షిగా ఎన్నో అవినీతి ఆరోపణలు చేశానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాయలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పై స్వయంగా తాను ఎన్నో ఆరోపణలు చేశానని పేర్కొన్నారు. ఆధారాలతో సహా కళ్లకు కట్టినట్టు చూపించానని పేర్కొన్నారు. బీజేపీ తరుపున ఎప్పటికప్పుడు అవినీతిని ప్రజల దృష్టికీ తీసుకొచ్చానని పేర్కొన్నారు. కానీ బీజేపీ ఏం చేయనట్టు.. కేటీఆర్ ఏదో కొత్తగా చేసినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఢిల్లీ నుంచి ఫోన్ రాగానే నేను సైలెంట్ అయ్యానని మాట్లాడుతున్నారు కేటీఆర్. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బీజేపీ ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలబడుతుందని.. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నదే కాంగ్రెస్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు మహేశ్వర్ రెడ్డి. కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీకి వెళ్లి కే.సీ. వేణుగోపాల్ తో ఏం ఒప్పందం చేసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు మహేశ్వర్ రెడ్డి.