శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో కలకలం..తిరుపతి విమానం అత్యవసర ల్యాండింగ్‌ !

-

Emergency landing of Hyderabad Tirupati flight at Shamshabad International Airport: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హైదరాబాద్ తిరుపతి ఫ్లైట్ అత్యవసర లాండింగ్ కావడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి 66 మంది ప్రయాణికులతో తిరుపతి బయలుదేరిన అలయన్స్ ఎయిర్లైన్స్ విమానం 9I 877 సాంకేతిక కారణాల కారణంగా తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలోనే అత్యవసర లాండింగ్ అయింది.

Emergency landing of Hyderabad Tirupati flight at Shamshabad International Airport

6.12 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరిన ఫ్లైట్ తిరిగి 8.17 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టులోనే ల్యాండ్ అయింది. ఫ్లైట్ బయలుదేరిన తర్వాత అందులో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్ తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. అయితే.. ఈ విమానంలోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news