అనంతపురంలో రథం దగ్ధం ఘటనపై చంద్రబాబు సంచలన నిర్ణయం

-

CM Chandra babu : అనంతపురంలో రథం దగ్ధం ఘటనపై సీఎం చంద్రబాబు అత్యవసర విచారణకు ఆదేశాలు ఇచ్చారు. ఘటనా స్థలానికి వెళ్లాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ ఘటనకు గల కారణాలపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలన్నారు చంద్రబాబు. నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలన్న సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు.

CM Chandra babu ordered an urgent inquiry into the incident of chariot burning in Anantapur

ఈ తరుణంలోనే అనంతపురం కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో రామాలయంలోని రథం దగ్ధంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇప్పటికే నాలుగు బృందాలతో రథానికి నిప్పు పెట్టిన కేసులో విచారణ జరుగుతుందన్నారు డి.ఎస్.పి రవిబాబు. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. రథానికి నిప్పు పెట్టిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామంటున్నారు డీఎస్పీ రవిబాబు.

 

Read more RELATED
Recommended to you

Latest news