ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ..!

-

2024-25 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై గైడ్ లైన్స్ జారీ చేసింది ప్రభుత్వం. వికేంద్రీకరణ విధానంలో ధాన్యం కొనుగోళ్లకు మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం. రైతు సేవా కేంద్రాలు, ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని ఇ-పంట, ఈ కేవై సీ ద్వారా రైతులు, కౌలు రైతు వివరాలతో ధాన్యం కొనుగోళ్లకు ఆదేశాలు ఇచ్చింది. ఆధార్ అనుసంధానంతో ఇ-పంట , ఇ-కేవై సీ ద్వారా రైతుల ఖాతాల్లోకి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులు చేయాలని ప్రభుత్వ ఆదేశం.

ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, ఏపీ మార్క్ ఫెడ్ సంస్థలు రాష్ట్రస్థాయి ధాన్యం కొనుగోళ్లకు నోడల్ సంస్థలుగా పనిచేస్తాయని స్పష్టం చేస్తూ జీవో విడుదల చేసింది. ధాన్యం కొనుగోలు లావాదేవీల్లో ఉన్న రైస్ మిల్లర్లు కూడా ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ లో నమోదు కావాలని జీవోలో పేర్కొన్న ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్ధతు ధర కామన్ వెరైటీ క్వింటాలుకు రూ.2300 , గ్రేడ్ ఏ రకానికి రూ.2320 క్వింటాలుకు చెల్లించాలని స్పష్టీకరణ ఇచ్చింది. 2024-25 ఖరీఫ్ సీజన్ కు 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు స్పష్టం చేసిన సర్కార్.. సేకరణ సహా, మిల్లింగ్ ఆపరేషన్లను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లు, జేసీలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news