నేడు ఆ 7 జిల్లాల్లో భారీ వర్షాలు..!

-

మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరం, పశ్చిమ మధ్య బంగాళఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో బుధవారం రాష్ట్రంలోని  ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వీటిలో ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. 

మరికొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇక మంగళవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. జనగాం జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో అత్యధికంగా 11.5 సెం.మీ. వర్షపాతం నమోదు అయింది. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కామారెడ్డి గూడెంలో 10.9 సెం.మీ., దామరచర్ల మండలం తిమ్మాపూర్ లో 9.9, శాలిగౌరారంలో 9.1, రంగారెడ్డి జిల్లా నాగోల్ లోని రాక్ టౌన్ కాలనీ 8.9, మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉదిత్యాల్ 8.8, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దమ్మన్న పేట మండలం మండలపల్లిలో 8.7, రంగారెడ్డి జిల్లా ఎలిమినేడులో 8.5 సెం.మీ. వర్షపాతం నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news