ఇప్పటికే స్పైడర్ మరియు సర్కార్ సినిమాలతో పరాజయాలను చవిచూసిన మురుగదాస్ సూపర్ స్టార్ రజనీ తో సినిమాతో పుంజుకుంటాడని అందరూ ఆశపడ్డారు. అయితే సంక్రాంతి కన్నా ముందే విడుదలైన ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని మరియు చాలా రోజుల తర్వాత రజిని పోలీస్ డ్రెస్ లో కనబడుతున్న నేపథ్యంలో ఈ చిత్రంపై రజినీ అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
ఇక చిత్రం మొదటి భాగం బాగుంది ఇంటర్వెల్ బ్యాంగ్ తో మురుగదాస్ అభిమానుల అంచనాలను ఒక రేంజ్ కు తీసుకెళ్లారు. ఇక రెండవ భాగం కూడా చిరిగిపోతుంది అనుకుంటున్న దశలో అర్థం పర్థం లేని క్లైమాక్స్ మరియు నిండా నొసుగులతో కూడిన స్క్రిప్టుతో మురుగదాస్ రెండో భాగం పూర్తిగా బోర్ కొట్టించేశాడు.
ఇంకా చెప్పాలంటే కేవలం రెండో భాగం మొత్తం రజిని స్వాగ్ మీదనే లాక్కొచ్చాడు ఈ తమిళ దర్శకుడు. మామూలుగా మురుగదాస్ అంత చక్కగా కామెడీ పండించగల డైరెక్టర్ అయితే కాదు. కథ రెండో భాగం లో రజనీ మాస్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని సీరియస్ నెస్ క్రియేట్ చేయడంలో విఫలమైన మురుగదాస్ కేవలం ఆయనను నమ్ముకొని కామెడీ షాట్ లు తీయడం వంటి ఎన్నో పొరపాట్లు చేశాడు. అందుకు మూల్యంగా ఇప్పుడు రజనీ ఫ్యాన్స్ నోటమాట పడుతున్నాడు.
సినిమా అస్సలు నచ్చని కొందరు ట్విటర్ రజిని అభిమానులు మురుగదాస్ అడ్రస్ ఇవ్వండి అంటూ గొడవ చేస్తుంటే .. కొంతమంది మాత్రం సినిమా చాలాబాగుంది అంటూ మురుగదాస్ కి థాంక్స్ చెప్పడం కోసమా అడ్రస్ అడుగుతున్నారు !!