హర్యానా ఎన్నికలు.. తొలి ర్యాలీతోనే ప్రత్యర్థులకు మోడీ చెక్

-

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ హర్యానాలో తన తొలి ప్రచార ర్యాలీని బుధవారం ప్రారంభించనున్నారు.ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీ వెల్లడించారు. అయితే, గోహనా నియోజకవర్గం నుంచే ప్రధాని మోడీ తొలి ర్యాలీ ఉంటుందని, ఇందులో 22 అసెంబ్లీలకు చెందిన కార్యకర్తలు,ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొంటారని బడోలీ చెప్పారు. ఈ ఎన్నికల కోసం మోడీ ఏకంగా 22 అసెంబ్లీ స్థానాల్లో ర్యాలీలు నిర్వహిస్తారని ప్రకటించారు.

pm modi on Jammu and Kashmir Assembly elections begins

అంతకుముందు, ఇదే విషయంపై ప్రధాని మోడీ కూడా తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్‌’ వేదికగా మంగళవారం స్పెషల్ పోస్టు పెట్టారు.బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు హర్యానాలో ఎన్నికల ర్యాలీ ప్రారంభం అవుతుందని, పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు.‘హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వేడుకల్లో రెట్టింపు ఉత్సాహంతో రేపు(బుధవారం) మధ్యాహ్నం 12 గంటలకు సోనిపట్‌లో జరిగే ర్యాలీలో ప్రజా ఆశీర్వాదం పొందే భాగ్యం మనకు కలుగుతుంది’ అంటూ మోడీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news