పూణేలో గ్రౌండ్ మీద ఆశలు పెట్టుకున్న శ్రీలంక జట్టు, ఎందుకో తెలుసా…?

-

భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడో టి20 ఇప్పుడు రసవత్తరంగా మారింది. మొదటి మ్యాచ్ రద్దు కావడం రెండో మ్యాచ్ లో టీం ఇండియా గెలవడంతో మూడో మ్యాచ్ లో గెలిచిన వారిదే సీరీస్ కానుంది. దీనితో రెండు జట్లు కూడా ఈ మ్యాచ్ లో విజయం సాధించడానికి గాను తీవ్రంగానే కష్టపడుతున్నాయి. ఎలా అయినా సరే టి20 గెలిచి సీరీస్ ని కైవసం చేసుకోవాలని టీం ఇండియా భావిస్తుండగా,

మూడో మ్యాచ్ లో శ్రీలంక ను ఓడించి సీరీస్ ని సమం చేసి వన్డే సీరీస్ కి సిద్దం కావాలని శ్రీలంక భావిస్తుంది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శ్రీలంకతో మూడో టీ20లో భారత జట్టు తలపడనుంది. కొత్త ఏడాదిని విజయం తో మొదలుపెట్టిన టీం ఇండియా ఈ మ్యాచ్ ద్వారా సీరీస్ ని తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తుంది. పూణే క్రికెట్ గ్రౌండ్ లో తమకు లక్ కలిసి వస్తుందని శ్రీలంక ఆశపడుతుంది.

ఒకసారి ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 10 టి20 మ్యాచులు జరగగా ఒక్క పుణేలో మాత్రమే శ్రీలంక 2017 లో విజయం సాధించింది. దీనితో శ్రీలంక ఇప్పుడు ఆ గ్రౌండ్ కలిసి వస్తుందని ఆశగా ఎదురు చూస్తుంది. ఇక జట్ల విషయానికి వస్తే బ్యాటింగ్ ఆర్డర్ లో హిట్టర్లను ఉంచాలని శ్రీలంక భావిస్తుంది. ఇక టీం ఇండియా కెప్టెన్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్ లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news