ఖమ్మం చేరుకున్న విక్టరీ వెంకటేష్..!

-

సినీనటుడు విక్టరీ వెంకటేశ్ మంగళవారం మధ్యాహ్నం ఖమ్మం బైపాస్ రోడ్డులోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామ్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు నగరంలోని మయూరి సెంటర్, పాత బస్టాండ్, జెడ్పీ సెంటర్ మీదుగా ఇల్లెందు క్రాస్ రోడ్డు వరకు రోడ్ షో నిర్వహించి, కార్నర్ మీటింగ్ లో మాట్లాడనున్నారు.

అనంతరం రాత్రి 8 గంటలకు కొత్తగూడెం చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు. పార్లమెంట్ బరిలో నిలిచిన రామసహాయం రఘురామ్ రెడ్డి కుమారునికి వెంకటేశ్ కుమార్తెనిచ్చి వివాహం చేశారు. దీంతో వీరి మధ్య ఉన్న బంధుత్వం మేరకు ఇప్పటికే వెంకటేశ్ కుమార్తె జిల్లాలో ప్రచారం నిర్వహిస్తుండగా నేడు వియ్యంకుని గెలుపు కోసం రెండు జిల్లాల్లో వెంకటేశ్ సైతం ప్రచారం నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news