తుప్పు పట్టిన సైకిల్ కి మిగిలింది బెల్ మాత్రమే : సీఎం జగన్

-

తుప్పు పట్టిన సైకిల్ కి మిగిలింది బెల్ మాత్రమేనని ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ జంక్షన్ లో జరిగిన ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు ఎన్నికల ముందు రకరకాల వాగ్దానాలు ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చలేదు. ప్రతీకారంగానే 2019లో రైతన్నలు, ఆడపడుచులు, అన్ని సామాజిక వర్గాలు.. పల్లె పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్ ని ఏ ముక్కకు ఆ ముక్క విరిసి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్ కోసం చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు.

ఆ సైకిల్ రిపేర్ చేసే క్రమంలో తొలుత ఎర్ర చొక్కాల వద్దకు వెళ్తే.. ఫలితం రాలేదు. ఆ తర్వాత దత్త పుత్రుడిని పిలుచుకున్నారు. తుప్పు పట్టింది.. నేను క్యారేజీ మీద మాత్రమే ఎక్కుతాను. టీ గ్లాస్ పట్టుకుని తాగుతా అని దత్త పుత్రుడు అన్నాడు. ఆ తర్వాత బాబు తన వదినమ్మను ఢిల్లీ పంపించారు. ఆమె ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి సైకిల్ రిపేర్ కోసం మెకానిక్ లను పిలిపించుకున్నారు. వాళ్లొచ్చి.. తుప్పు పట్టిన ఆ సైకిల్ ని చూశారు. ఆ సైకిల్ కి సీటు లేదు. చక్రాల్లేవ్..  పెడెల్ లేదు.. ట్యూబ్ లు లేవ్. మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు. మరి ఇంతలా తుప్పు పడితే ఎలా బాగు చేస్తామయ్యా అని అడిగారు. పిచ్చి చూపులు చూసి బెల్ కొట్టడం మొదలుపెట్టాడు. ఆ బెల్ పేరే అబద్ధాల మేనిఫెస్టో.

Read more RELATED
Recommended to you

Latest news