జగన్‌ తిరుమల పర్యటనలో ట్విస్ట్..రోడ్డు మార్గానే కొండపైకి !

-

జగన్‌ తిరుమల పర్యటనలో ట్విస్ట్ నెలకొంది. రేపు సాయంత్రమే తిరుమలకు వెళ్లనున్నారు మాజీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి. రేపు సపాయంత్రం 7 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు మాజీ సిఎం జగన్. అనంతరం రోడ్డు మార్గన తిరుమల పయనం అవుతారు. అయితే.. మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అలెర్ట్ అయ్యారు పోలీసులు.

Jagan to visit Tirumala temple on September 27

ముందు జాగ్రత్తగా కొందరూ నేతలను అరెస్టు చేసే అవకాశం ఉంది. అటు జగన్ కు ఘన స్వాగతం పలికేందుకు సిద్దమౌతున్నారు తిరుపతి జిల్లా నేతలు. కాగా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తిరుమల పర్యటనపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిన వారికి మళ్లీ అక్కడికి వెళ్లే అర్హత లేదని మండిపడ్డారు. చెప్పినా వినకుండా వెళ్తే హిందువులు ఏకమై వారిని చంపేస్తారని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news