కేసీఆర్ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ : హరీశ్ రావు ఫైర్

-

మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని, ఎవరు అవునన్నా.. కాదన్నా అదే నిజమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.గత తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలన వ్యవసాయ రంగానికి ఒక సువర్ణ అధ్యాయం అని తెలిపారు. 2023-24 ఏడాదికి గాను వరి ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో, పత్తి ఉత్పత్తిలో 3వ స్థానంలో నిలిచిందన్నారు. దీనిపై గురువారం ట్వీట్ చేసిన హరీశ్ రావు..

ఈ ఘనత మంత్రం వేస్తేనో.. మాయ చేస్తేనో జరిగిందని కాదని చెప్పారు. ఇదంతా ఒక్క రోజులోనూ జరిగింది కాదని, కేసీఆర్ తొమ్మిదేళ్ల కృషి, పట్టుదల, విజనరీ లీడర్ షిప్ వల్ల సాధ్యపడిందన్నారు. అయితే, కేసీఆర్ కష్టపడి సాధించిన విజయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకున్నదని సెటైర్లు వేశారు. పంటల సాగులో మేటి మన తెలంగాణ..దేశానికే ఆదర్శం మన తెలంగాణ అని చెప్పుకొచ్చారు.కానీ, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news